శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 16 జులై 2019 (22:28 IST)

బార్లీ గింజలను పురుషులు తీసుకుంటే...?

మనకు ప్రకృతిలో సహజసిద్దంగా లభించే బార్లీ గింజల్లో అనేకరకములైన ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా బార్లీలో ఉండే నీరు అధిక బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది. బార్లీలో   కొలెస్ట్రాల్ ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ కనుక అరుగుదలకు మంచిది. బార్లీలో బి-విటమిన్లు, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బార్లీలో లోహం, పొటాషియం వంటి ఖనిజ పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటివలన కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
 
1. బార్లీలో ఉండే విటమిన్-బి నీటిలో కరిగే తత్వం కలిగి ఉంది. బార్లీ నీరు మూత్రపిండాల్లో రాల్లు ఏర్పడకుండా ఉంచే ఒక అద్బుత నివారణ మార్గంగా చెప్పవచ్చు. ప్రతిరోజూ ఒక గ్లాసు ఈ పానీయాన్ని తీసుకుంటే మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. 
 
2. బార్లీ గింజల పానీయం శృంగార సామర్ద్యాన్ని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇరవై గ్రాముల బార్లీ గింజలను అర లీటరు నీళ్లల్లో వేసి పావు లీటరు అయ్యే వరకు మరిగించి నలబై రోజులు తీసుకోవడం వలన శృంగార సామర్ద్యము పెరగుతుంది. అంతేకాకుండా మగవారిలో వీర్యకణాల సమస్యలు తొలగి సంతానం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 
 
3. మహిళల్లో ప్రసవం తరువాత బిడ్డకు తగినన్ని పాలు పడనట్లయితే రోజీ బార్లీ నీటిని ఒక కప్పు సేవించాలి. ఇది చనుబాలు ఇయ్యడంలో గొప్ప సహాయకారిగా పని చేస్తుంది. మరియు తల్లి బిడ్డ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
 
4. బార్లీని నీళ్ళలో నానవేసి రోజూ తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. అలాగే ఒంటికి నీరు చేరిన గర్భిణి స్త్రీలు బార్లీ నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడేవారు ప్రతీరోజూ బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గి నూతన శక్తి లభిస్తుంది.
 
5. బార్లీలో ఉండే బీటా గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విష పదార్దాలను బయటకు నెట్టివేయడంలో సహాయపడుతుంది. మరియు హెమోరాయిడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మలబద్దకాన్ని తగ్గిస్తుంది మరియు తద్వారా పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించి ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది.
 
6. బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేడ్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే  పాలలో బార్లీ వాడటం ద్వారా వారి ఎదుగుదలకి ఆరోగ్యానికి, శక్తికి దోహదం చేస్తాయి.