పాదాలకు చెప్పులు లేకుండా నడిచి చూడండి... ఏం జరుగుతుందో?
సాధారణంగా పాదాలకు చెప్పులతో నడవడం ఆరోగ్యం అనుకుంటాము. కానీ.... సిమెంటు నేలపైన, గ్రానైట్ రాళ్ల పైన కాకుండా మట్టి నేలపై చెప్పులు లేకుండా ఒట్టి కాళ్లతో నడవడమే ఆరోగ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఇలా నడవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
1. మట్టిలో, ఇసుకలో, పచ్చని పసిరికలో చెప్పులు లేకుండా నడిచే నడక మన మెదడుని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
2. మంచి నిద్రను ఆస్వాదించాలన్నా, ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా చెప్పులు లేకుండా నడవడం చాలా మంచిదట.
3. మన శరీరంలోని లిగమెంట్లు, కండరాలు, కీళ్లు శక్తివంతం కావాలంటే ప్రతిరోజూ కాకపోయినా వారానికోసారి అయినా మట్టి నేలపై, చెప్పులు లేకుండా నడవాలి.
4. చెప్పులు లేకుండా నడవడం వలన వెన్ను, మోకాళ్ల నొప్పులు బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే ఎత్తుపల్లాలు ఉండే చోట మాత్రం నడవకూడదు.
5. సాక్సులతో లేదా చెప్పులతో ఉండడం వలన పాదాలకు గాలి తగలదు. ఫలితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తవచ్చు. ఆఫీసులో ఉన్నవారు కాసేపు చెప్పుల్ని వదలడం వలన కాలి కండరాలకు గాలి తగులుతుంది.
6. చెప్పులు లేకుండా నడవడం వలన అరికాళ్లు నొప్పులు ఉన్నవారికి ఇది చక్కని వ్యాయామం కూడా. అయితే అలర్జీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో నడవాల్సి ఉంటుంది.