మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 22 జులై 2019 (22:27 IST)

పచ్చిమిరప కారం అనుకుంటారు కానీ... అవి చేసే మేలు తెలిస్తే...

కూరల్లో ఘాటు కోసం వాడే పచ్చి మిరపకాయల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ వీటిని తినడం వల్ల మనకు కేలరీల కంటే శక్తి ఎక్కువగా వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో పచ్చిమిరపను తీసుకోవడం వలన జీవన క్రియలు వేగవంతమవుతాయి. వీటిల్లో పలు రకాల ఔషద గుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాం.
 
1. పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను ఎప్పటికప్పుడు బయటకు పంపించివేస్తాయి. దీనితో క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ప్రొస్టేట్ గ్రంధి సమస్యలు దూరమవుతాయి. గుండె వ్యాధులు రాకుండా ఇవి రక్షణగా ఉంటాయి.
 
2. రక్తంలోని కొలస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడం ద్వారా ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి.
 
3. వీటిల్లో మంట అనిపించే రసాయనమే క్యాప్సేసియన్. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి సహకరిస్తుంది. 
 
4. జలుబు, సైనస్ ఉన్నవారికి పచ్చిమిరప సహజ ఔషదంగా పని చేస్తుంది.   క్యాప్సేసియన్ వల్ల రక్త సరఫరా బాగా జరిగి మెంబ్రేన్లలో శ్లేష్మం పలుచబడుతుంది. దీనితో ఉపశమనం లభిస్తుంది.
 
5.పచ్చిమిర్చిలో విటమిన్ సి, బీటాకెరోటిన్ ఉండడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి తోడ్పడతాయి.
 
6. పచ్చిమిర్చి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను క్రమబద్దీకరిస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు తమ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి. వీటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి. వీటిల్లో విటమిన్ కె కూడా తగినంత ఉంటుంది.