సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 10 ఆగస్టు 2019 (19:51 IST)

ఆ గింజలు చేసే మేలేంటో తెలుసా?

చాలామంది పండ్లను తినేసి వాటి గింజలను పడేస్తుంటారు. ఐతే పండ్లలో వుండే గింజలు కూడా ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగంగా వుంటాయని వైద్యులు చెపుతున్నారు. గుమ్మడి కాయ విత్తనాలు తినడం వల్ల డిప్రెషన్‌తో పాటు శరీరంలో వాపును కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 
నిమ్మకాయ గింజలు, కివి పండు గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రాక్ష పండు విత్తనాలను పడేయకుండా ఎండబెట్టి, పొడిగా దంచి తీసుకుంటే ఇది సహజ యాంటీ-బయాటిక్‌గా పని చేస్తుంది.
 
అదేవిధంగా పుచ్చులు లేని చింతగింజలను బాగా పెనంపై వేయించుకుని తర్వాత మంచి నీటిలో రెండు రోజులపాటు నానబెట్టాలి. ప్రతిరోజు రెండు పూటలా నీటిని మారుస్తుండాలి. ఇలా నానిన చింతగింజలను పొట్టు తీసేసి మెత్తగా పొడి చేసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. చింత గింజల పొడిని రోజుకు రెండుసార్లు అర టీ స్పూన్ చొప్పున పాలు లేదా నీటితో నెయ్యి లేదా చక్కెర కలిపి తీసుకోవాలి.
 
ఇలా చేస్తే రెండుమూడు నెలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. మోకాలి నొప్పి పూర్తిగా నయమవుతుంది. చింతగింజల చూర్ణం కీళ్ల నొప్పులకే కాక డయేరియా, డయాబెటిస్, గొంతులో ఇన్ఫెక్షన్లు ఇంకా దంత సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది. 
 
అలాగే నేరేడు పండ్ల పొడిని నీళ్లలో వేసి మరిగించి కషాయం రూపంలో సేవిస్తే మధుమేహులకి మరీ మంచిది. ముఖ్యంగా గింజల్లోని గ్లైకోసైడ్‌ పిండిపదార్థాల్ని చక్కెరలుగా మారకుండా అడ్డుకుంటుంది. పైగా క్లోమగ్రంథుల నుంచి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచే గుణాలూ ఈ గింజల్లో ఉన్నాయి. ఈ పొడి అతి దాహాన్నీ తగ్గిస్తుంది.