శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 14 ఆగస్టు 2019 (21:37 IST)

బాగా ఎక్కువున్న గింజలు కలిగిన జామపళ్లు తింటే ఏమవుతుంది?

పచ్చి జామకాయల్లో పాస్పారిక్, ఆక్సాలిక్ వంటి ఆమ్లాలు ఉంటాయి. వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. అదేవిధంగా ఎక్కువగా గింజలు ఉన్న జామపళ్లను తింటే అపెండిసైటిస్( 24 గంటల జబ్బు) వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల దోరగా పండిన జామ పండును గానీ, లేదంటే గింజలు తక్కువ ఉన్న జామకాయను కానీ తినాలి.
 
ఇక జామకాయల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. దంతాలు, చిగుళ్లనుంచి రక్తం కారేవారు జామకాయను కొరికి, బాగా నమిలి చప్పరించి ఆ పిప్పిని ఊసేయాలి. ఇలా చేయటం వల్ల రక్తం కారటం ఆగిపోవటమేకాదు దంతాలకు మేలు కలుగుతుంది. 
 
గుండె బలహీనంగా ఉన్నవారు, క్షయవ్యాధితో బాధపడేవారు, బహిస్టు నొప్పులు అధికంగా ఉన్నవారు పండిన జామగుజ్జుతో తేనె, పాలు కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు సౌందర్యానికి జామ ఎంతో ఉపయోగపడుతుంది. జామ ఆకులను మెత్తగా నూరి ముఖంమీద వచ్చే మొటిమలకు రాసినట్లయితే అవి తగ్గిపోతాయి. తరచుగా జలుబుతో బాధపడేవారు పండిన జామపండులో ఓ 5 గ్రాముల జామచెట్టు బెరడును కలిపి సేవిస్తే సమస్యనుంచి బయట పడవచ్చు.