1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Do it, Get a good night's sleep 15 minutes before going to bed

పడుకోబోయే ముందు 15 నిమిషాలు ఆ పని చేస్తే హాయిగా నిద్ర

good night
యోగా సర్వ రోగ నివారిణిగా పనిచేస్తుంది కాబట్టి వ్యాయామం చేయలేని వారికి యోగా ఉత్తమం. యోగా చేయుట వలన మనసు ప్రశాంతత పొంది మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది.
 
నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మెదడు వికాసం పొందుతుంది. నానబెట్టిన బాదం పప్పులు తింటే శరీరమును ఉత్సాహపరుచుటకు ఉపయోగపడుతుంది.
 
నిద్రలేమితో బాధపడుతుంటే పడుకోబోయే ముందు పదిహేను నిమిషాల సేపు పాదాలను, అరికాళ్లను నెయ్యి లేదా ఆముదంతో మర్దన చేస్తే ప్రశాంతంగా, హాయిగా నిద్ర వస్తుంది.
 
ప్రతి రోజూ ఒకటి లేద రెండు ఖర్జూరం పండ్లు తింటే శరీరంలో అనవసరంగా చేరు కొవ్వు తగ్గుతుంది. శరీరానికి కావలసిన చురుకుదనం అధికంగా ఈ ఖర్జూర పండ్ల నుంచి పొందవచ్చును.
 
రోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినండం వల్ల గుండె పదిలంగా వుంటుంది. శరీరమునకు ఏ రకమైన వ్యాధి రాకుంటా ఉండేందుకు ఈ పండ్లు, కూరగాయలు చాలా బాగా ఉపయోగపడుతుంది.
 
డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్ల రసం, కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్‌డ్రింకులు మాత్రం తీసుకోకూడదు.
 
మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వుల నూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటి మీద మర్దన చేయాలి. రాత్రి పూట మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి.
 
ఒక స్పూన్ కొత్తిమీర రసానికి ఒక కప్పు మజ్జిగ చేర్చి తాగితే అజీర్ణం, వాంతులు, ఎక్కిళ్లు లాంటి సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల పళ్లు, చిగుళ్లు కూడా బలంగా తయారవుతాయి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
వక్రమార్గంలో అక్రమార్జన వద్దు.. మంచి మార్గాన్ని ఎంచుకో...