1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Eating these food items with jaggery combination is good for health

బెల్లం కాంబినేషన్‌తో వీటిని తింటే ఆరోగ్యం అదుర్స్

Healthy food items with jaggery
బెల్లం. ఒక్క చిన్న ముక్క బుగ్గన పెట్టుకున్నా శరీరానికి శక్తి వచ్చేస్తుంది. ఇందులో ఖనిజాలు, విటమిన్లు శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తాయి. ఈ బెల్లాన్ని ఇప్పుడు చెప్పుకోబేయే వాటితో కలిపి తీసుకుంటే ఆరోగ్యం అదుర్స్ అంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. బెల్లంతో శొంఠి పొడి కలుపుకుని తింటే జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
శరీరంలో వాపులు వున్నవారు కూడా ఈ బెల్లం మిశ్రమాన్ని తింటే ప్రయోజనం వుంటుంది. బెల్లంతో సోంపును కలిపి తింటుంటే నోటి దుర్వాసన దూరమవుతుంది. నువ్వులు-బెల్లం రెండూ కలిపి తింటే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు రావు.
 
బెల్లం-వేరుశనగ పప్పు వుండలను తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ధనియాలతో బెల్లాన్ని కలిపి తీసుకుంటే మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి బయటపడవచ్చు.
తర్వాతి కథనం
ఎదిగే పిల్లలకు బెల్లం- వేరుశనగ పప్పు ఉండలు ఇవ్వాలి, ఎందుకంటే?