బెల్లంతో మహిళలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
బెల్లం. పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని చాలామంది వినియోగిస్తుంటారు. పంచదార కంటే బెల్లంతో మేలు కలుగుతుందని, బెల్లంలో ఆరోగ్యానికి దోహదపడే అంశాలున్నాయని చెపుతారు. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం తీసుకుంటుంటే అందులోని పోషకాలు మహిళల్లో రక్తహీనత సమస్యను నివారిస్తుంది.
బెల్లాన్ని నేరుగా కాకుండా ఇతర పదార్థాలతో తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. బెల్లాన్ని వేరుశనగ పప్పుతో కలిపి తీసుకుంటే శక్తి పెరుగుతుంది. బెల్లాన్ని ధనియాలతో కలిపి తీసుకుంటుంటే నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు.
బెల్లంతో సోంపును కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ సమస్యలు రాకుండా వుంటాయి. బెల్లం, శొంఠిపొడి కలిపి తినడం వల్ల జ్వరం నుంచి కోలుకుంటారు.