బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 14 అక్టోబరు 2023 (22:50 IST)

క్యారెట్ రసం తాగుతున్నారా?

క్యారెట్‌. కంటి ఆరోగ్యానికి క్యారెట్ ఎంతగానో మేలు చేస్తుంది. మన శరీరానికి కావలసిన పోషకాలను పచ్చి క్యారెట్లు తిన్నా, క్యారెట్ రసం తాగినా లభిస్తాయి. క్యారెట్ ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. క్యారెట్‌లో వుండే ఫైటోకెమికల్స్‌ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యారెట్ రసం లుకేమియాను కూడా ఎదుర్కోగలదని అధ్యయనాలు చెబుతున్నాయి.
 
క్యారెట్లు విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల శక్తి కేంద్రాలు కనుక కేశ సంపదకు మేలు చేస్తుంది. క్యారెట్ రసంలోని పోషకాలు రక్తపోటును అదుపులో వుంచుతాయి.
కప్పు క్యారెట్ రసంలో గ్లాసు పాలు, కొద్దిగా తేనె కలిపి పది బాదం పప్పులతో తీసుకుంటే జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.
 
పచ్చి క్యారెట్ దుంపను తింటే నులిపురుగు లాంటి సమస్యలు తొలగడంతో పాటు రక్తం శుభ్రపడుతుంది. మూత్రశయం, మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు క్యారెట్‌ను సేవిస్తే మేలు చేస్తుంది.