సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (19:40 IST)

మళ్లీ మళ్లీ వేడి చేసిన టీని తాగుతున్నారా?

Tea
Tea
మళ్లీ మళ్లీ వేడి చేసిన టీని తాగుతున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. మళ్లీ మళ్లీ వేడి చేసే టీని తాగడాన్ని ఎందుకు నివారించాలంటే.. వేడి చేసి తాగే టీలో పోషకాలు నశిస్తాయి. రుచి, వాసన కూడా మారిపోతుంది. 
 
తాజాగా తయారుచేసిన కప్పు టీ కంటే మళ్లీ వేడి చేసినప్పుడు సిప్ చేసే టీ టేస్టు పెద్దగా వుండదు. టీని నాలుగు గంటల పాటు కాచుకున్న తర్వాత, మళ్లీ వేడి చేసి తీసుకోకపోవడమే మంచిది. ఈ సమయంలో, బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. 
 
టీని కేవలం ఒక గంట లేదా రెండు గంటలు వరకే వుంచి ఒక్కసారి మాత్రమే వేడి చేసుకుని తీసుకోవచ్చు. ముఖ్యంగా పాలు చేర్చిన బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంది. మిల్క్ టీలో చక్కెర కలపడం ద్వారా బాక్టీరియా ఈజీగా చేరుతుంది. 
 
పాలతో పంచదారను కలిపినప్పుడు, ఆ టీ వేగంగా చెడిపోవడానికి దారితీస్తుంది. ఇది తలనొప్పి లేదా కడుపునొప్పి వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.