శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (11:20 IST)

భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. OTT ప్లాట్‌ఫారమ్‌లో రికార్డు..

indo - pakistan
వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తాజాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రికార్డ్ సాధించింది. ఈ మ్యాచ్‌ను శనివారం ఎంతో ఆసక్తిగా తిలకించారు.. క్రికెట్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్‌ను ఆఫ్‌లైన్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు.
 
ప్రేక్షకులు OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్ స్టార్‌లో ఏకకాలంలో 35 మిలియన్లకు పైగా చూశారు.
 
అంటే మూడున్నర కోట్ల మందికి పైగా వీక్షకులు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించారు. దీంతో వరల్డ్ వైడ్ OTT చరిత్రలో ఏ క్రీడకూ రాని భారీ రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి భారత్-పాక్‌ల మధ్య అసలైన మ్యాచ్‌నే అతిపెద్ద పోటీ అని మరోసారి రుజువైంది. ICC ODI ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తిరుగులేని విజయం సాధించింది.