ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు...

gold
దేశంలో పసిడి ప్రియులు షాకయ్యారు. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పండగల సీజన్‌లో బంగారు కొనుగోలు చేయాలనుకునేవారికి నిజంగా ఇది ఏమాత్రం అనుకూలం కాదు. శనివారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,910గా ఉంటే, ఆదివారం ఈ ధర రూ.1530 పెరిగి ప్రస్తుతం రూ.60,440కి చేరుకుంది. మరోవైపు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.54 వేలు ఉండగా రూ.1400 పెరిగి, రూ.55,400కు చేరుకుంది.
 
కాగా, ఇజ్రాయెల్ - పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత బంగారు ధరలు భారీగా పెరిగిపోయి, ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.52,600, రూ.57,380కి పడిపోయాయి. అయితే, తాజాగా ఒక్కసారిగా బంగారం కొనుగోళ్ళు విపరీతంగా పెరిగిపోవడంతో వీటి ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే, ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చాలా మంది అంచనా వేస్తున్నారు.