గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2023 (12:46 IST)

భారత్‌కు చేరుకున్న "ఆపరేషన్ అజయ్" 2వ విమానం

Operation Ajay
Operation Ajay
ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం మరో విమానం 235 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకుంది. భారత ప్రభుత్వం సొంత ఖర్చులతో ఈ చార్టెడ్ విమానాలను ఏర్పాటు చేసింది. 
 
ఈ విమానాల్లో భారత్ రావాలనుకునే వారు ముందుగా తన పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికే ప్రయాణం కల్పించేలా భారత్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా ఈ ఫ్లైట్స్ నిర్వహిస్తోంది. 
 
కాగా, ఆదివారం కూడా ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది. తమను సురక్షితంగా తరలిస్తున్న భారత్‌కు ఎన్నారైలు ధన్యవాదాలు తెలిపారు.