గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (20:33 IST)

ఇజ్రాయెల్ దాడులు.. 447 మంది చిన్నారులు మృతి

Kids
Kids
ఇజ్రాయెల్ దాడుల వల్ల 3,38,000 మంది పాలస్తీనా వాసులు నిరాశ్రయులు అయ్యారు. అలాగే ఇజ్రాయెల్‌ల్లో హమాస్ దాడుల వల్ల 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇంకా ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశానికి చెందిన 447 మంది చిన్నారులు మృతి చెందినట్లు పాలస్తీనా ప్రకటించింది. ఇజ్రాయేల్ - హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్న సంగతి తెలిసిందే.
 
ఇప్పటివరకు మొత్తంగా 1,417 మంది ప్రాణాలు కోల్పోగా.. 6,268 మంది గాయపడ్డారని పాలస్తీనా వెల్లడించింది. గాజా ప్రాంతంలో ఇజ్రాయేల్ తలచుకుంటే ఆహారం, ఇంధనం, విద్యుత్ కూడా అందదని తెలిసినా హమాస్ కనికరించలేదు. ఈ ఊహించని సంఘటన నుంచి తేరుకున్న ఇజ్రాయేల్ ప్రతిదాడి తీవ్రంగా చేస్తోంది.