1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 మే 2023 (15:31 IST)

డా.గజల్ శ్రీనివాస్‌‍కు 'సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం'

gazal srinivas
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్గంగిణీ సంగీత సంస్థ, స్వరంగిణీ జన వికాస సమితి ఆధ్వర్యంలో ఇండోర్‌లో అభినవ్ కళా సమాజ్, గాంధీ హాలులో నిర్వహించిన "సంత్ కబీర్ ఉత్సవ్"లో ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గ్రహీత, ప్రఖ్యాత గజల్ గాయకుడు "మాస్ట్రో" డా.గజల్ శ్రీనివాస్‌కు "సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం'' అందించారు. ఈ వేడుకలో ముఖ్య అథితిగా పాల్గొన్న ఇండోర్ ఆకాశవాణి సంచాలకులు సంతోష్ అగ్నిహోత్రి చేతుల మీదుగా బహుకరించారు.
gazal srinivas
 
ఈ సభలో డా.గజల్ శ్రీనివాస్ ఆలపించిన కబీర్ దోహే, సూఫీ ఉర్దూ గజల్ గానం ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసిందని, వారాణసికి చెందిన తానా బానా మ్యూజిక్ బ్యాండ్ కబీర్ సాహిత్య గానం శ్రోతలను ఆకట్టుకుందని నిర్వాహకులు గురు చరణ్ దాస్, అంజన్ సక్సేనాలు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగింది.