ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (15:41 IST)

భగత్ సింగ్ అపూర్వమైన దేశభక్తుడు : కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే

gazal srinivas
షహీద్ భగత్ సింగ్ ఒక అపూర్వమైన దేశ భక్తుడని, ఆయన అందరివాడని, రాబోయే తరాలవారికి ఆయన ఒక స్ఫూర్తి జ్యోతి అని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే భగత్ సింగ్ సేవలను కొనియాడారు. భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా రాజ్ త్రిపాఠీ, రాహుల్ ఇంక్విలాబ్ రచించిన "క్రాంతీ కి దరోహర్" (హిందీ) గ్రంథాన్ని ముఖ్య అతిధి కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే శ్రీ అంబేద్కర్ ఆడిటోరియం, ఆంధ్ర భవన్, ఢిల్లీలో 28 సెప్టెంబర్ 2023న సాయంత్రం 5 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.
gazal srinivas
 
సభకు ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల సృష్టికర్త, సేవ టెంపుల్స్ భారత్ అధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ శాంభవి మఠాధిపతి శ్రీ స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ మాట్లాడుతూ పటిష్ట భారత దేశం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కృషి  చేయాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగళ్ పాండే, భగత్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల వారు పాల్గొన్నారు. రవి, జి.వి.ఆర్.మురళిలు సభా నిర్వహణ చేశారు.