సంబంధిత వార్తలు
- నాకు పేరు ముందు బిరుదులు పెట్టుకోవడం ఇష్టం లేదు : విజయ్ దేవరకొండ
- వాల్తేరు వీరయ్య 200 రోజులు వేడుకని చూస్తుంటే ఒళ్లు పులకరిస్తోంది : మెగాస్టార్ చిరంజీవి
- వరుణ్ తేజ్ తో 1958 నాటి కథతో మట్కా పూజా కార్యక్రమాలతో ప్రారంభం
- మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో టోవినో థామస్ హీరోగా నడికర్ తిలకం కొచ్చిలో ప్రారంభం
- రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో RT4GM రాబోతుంది
ఉస్తాద్ భగత్ సింగ్ మాసీవ్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం
Ustad Bhagat Singh
పవన్ కళ్యాణ్ ఈరోజు షూట్‌లో జాయిన్ అయ్యారు. కొత్త షెడ్యూల్ మాసీవ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్‌లో షేడ్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి అండ్ టీమ్ మాసీవ్ సెట్‌ని రూపొందించారు.
మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి మాస్‌ను మెప్పించే సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో టెర్రిఫిక్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు.
ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎడిటింగ్ ఛోటా కె ప్రసాద్. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ
