మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2023 (18:41 IST)

నాకు పేరు ముందు బిరుదులు పెట్టుకోవడం ఇష్టం లేదు : విజయ్ దేవరకొండ

Vijay Deverakonda
Vijay Deverakonda
విజయ్ దేవరకొండ నటించిన  ఖుషి సినిమా ట్రైలర్ విడుదల ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఐదు భాషల్లో సినిమా విడుదల కాబోతుంది. అందుకే ఐదు భాషలకు చెందిన మీడియా హాజరయ్యారు. పార్క్ హయత్ హోటళ్ల లో జరిగిన వేడుకలో సమంత హాజరుకాలేదు. అయినా ఆమె కోసం సీట్ నా పక్కనే ఉంచారు. నేను ఒక్కడినే కూర్చోవడం ఏదోగా అనిపించించింది. కానీ తప్పదు అని అన్నారు. ఇక  ఆయన స్టేజి పైకి  నేరుగా తెరవెనుక నుంచి వచ్చారు. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న స్క్రీన్ నుంచి రావడం, అందులోనూ బ్లూ డ్రెస్ లో రావడంతో సింబాలిక్ గా ఉండడంతో పాటు అందరికి వారి వారి భాషల్లో నమస్కారం పెట్టారు. సమంత వస్తే ఇలాగే వచ్చి అందరికి కిస్ ఇచ్చేదని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. 
 
కలర్ ఫుల్ గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న ‘ఖుషి’ రిలీజ్ కు రెడీ అవుతోంది. 
 
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఇదొక అమేజింగ్ ఫిల్మ్. క్యూట్ లవ్ ఫిల్మ్. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు మా కథకు కనెక్ట్ అవుతారు. మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇది. ఇలాంటి చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మన కథలను చూపించే అవకాశం దక్కుతోంది. ఇలాంటి టైమ్ లో నేను హీరోగా ఉండటం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. పరస్పరం అర్థం  చేసుకోవడం,  ప్రేమను పంచడం ..ఈ రెండు క్వాలిటీస్ జీవిత భాగస్వామికి ఉండాలి. కష్ట సుఖాల్లో ఒకరికి మరొకరు సపోర్ట్ గా నిలవాలి. అప్పుడే బంధాలు నిలుస్తాయి. నాకు ఆ మధ్య ప్రేమ కథల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఖుషి కథ విన్న తర్వాత  బ్యూటిఫుల్ ఫీల్ కలిగింది. మళ్లీ ప్రేమ కథల్లో నటించాలనే ఆసక్తి కలిగింది. 
 
మేమంతా మణిరత్నం సార్ అభిమానులం. ఆయన సినిమాలను ఎంతో ఇష్టపడతాం. ఒకప్పుడు నా దగ్గర ఎవరూ పెళ్లి మాట ఎత్తేవారు కాదు. కానీ ఈ మధ్య నా స్నేహితులు పెళ్లి చేసుకోవడం , వాళ్ల జీవితాలు చూస్తుంటే నాకు పెళ్లి మీద అయిష్టం పోయింది. వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఛాప్టర్. నేనూ ఆ ఛాప్టర్ లోకి అడుగుపెడతా. తమిళంలో నాకు నచ్చిన దర్శకులు చాలా మంది ఉన్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిల్లర్ డైరెక్టర్ అరుణ్, వెట్రి మారన్, పా రంజిత్. అవకాశం వస్తే వాళ్లతో తప్పకుండా సినిమా చేస్తా. మలయాళంలోనూ నాకు సినిమాలు చేయాలని ఉంది. అయితే మలయాళం మాట్లాడటం వచ్చిన తర్వాత అక్కడ మూవీ చేస్తా. 
 
 నాకు వెబ్ సిరీస్ లు చేసే ఉద్దేశం లేదు. నాకు పేరు ముందు బిరుదులు పెట్టుకోవడం ఇష్టం లేదు. అందుకే ఈ సినిమాలో ద విజయ్ దేవరకొండ అని టైటిల్స్ లో పెట్టాం. అని చెప్పారు.