బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (16:57 IST)

విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి చిత్రం ట్రైలర్ డేట్ ఫిక్స్

Vijay Devarakonda, Samantha
Vijay Devarakonda, Samantha
డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఖుషి సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రస్తుతం స్వింగులో ఉన్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే నా రోజా నువ్వే, ఆరాధ్య వంటి పాటలు వచ్చాయి. యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాట అయిన నా రోజా నువ్వే వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది.
 
కాగా, ఖుషి చిత్రం ట్రైలర్ డేట్ ఫిక్స్ చేశారు. ఆగష్టు 9న తెలంగాణలో ఓ ప్రాంతంలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దాని పూర్తీ వివరాలు త్యరలో తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. ప్రముఖ హీరో హాజరుకానున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఇంకా 26 డేస్ లో థియేటర్ లో రాబోతున్నామని విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. తన సినిమా కోసం చాలా ఆదుర్దాగా ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి.
 
ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు. 
 
నటీనటులు:  విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.