ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (16:12 IST)

సమంతకు సోషల్ మీడియా ఫాన్స్ మద్దతు

Samantha letter
Samantha letter
సమంత ప్రభుకు మాయోసైటిస్ అనే వ్యాధి ఉందని దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిసిందే. ఇందుకోసం ఓ హీరో నుంచి 25 కోట్లు తీసుకున్నట్లు కొన్ని మీడియాలో కధనాలు వచ్చాయి. దానికి సమంత సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. ముక్కుకు గాలి పీల్చుకునే మాస్క్ వేసుకుని ట్రీట్ మెంట్ ఎలాఉంటుందని చూపించే ప్రయత్నం చేసింది.  25 కోట్లు తీసుకున్నట్లు చదివాక ఇది చాలా బాడ్ న్యూస్ అనిపించింది. కనీసం తెలుసుకుని రాయండి అని తెలిపింది.
 
కాగా, సమంత ఖండన తర్వాత నెటిజన్స్ ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ఆమె చాలా దృఢంగా,  నమ్మకంగా ఉన్న స్త్రీలు కాబట్టి తన స్వీయ సంరక్షణను ఎలా తీసుకోవాలో ఆమెకు తెలుసు అని కొందరంటే, తాను బాగా రిచ్. ఆఅవసరం ఆమెకు ఉండదు అని మరికొందరు తెలిపారు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూనే గ్యాప్ లో పలు ప్రాంతాలు పర్యటిస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తుంది.