శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (15:21 IST)

మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా!? ఖండించిన సమంత

Samantha
దక్షిణాది భాషలతో పాటు ఉత్తరాదిన కూడా ప్రత్యేక రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సమంత.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.  నటి సమంత గత ఏడాది మయోసైటిస్‌తో బాధపడుతూ కొన్ని నెలలుగా చికిత్స పొందుతోంది. ఈ వ్యాధి నుంచి క్రమంగా కోలుకున్న ఆమె.. చికిత్స కోసం అప్పు తీసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
సమంత ఇటీవల ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లింది. అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నటి సమంత వైద్యం కోసం ప్రముఖ తెలుగు నటుడి వద్ద రూ.25 కోట్లు అప్పు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని సమంత ఖండించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా!? ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు.
 
ఇందులో తాను ఖర్చు చేసింది చాలా స్వల్పమే. తన కెరీర్‌లో సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేశానని తాను అనుకోవడం లేదు. తాను జాగ్రత్తలు చూసుకోగలను. ధన్యవాదాలు. మయోసైటిస్ అనేది ఓ సమస్య. వేలాది మంది దీనితో బాధపడుతున్నారు. చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యతగా ఉండాలని సమంతా పేర్కొంది.