గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 27 జులై 2023 (17:11 IST)

వంద మిలియన్ల వ్యూస్‌తో విజయ్ దేవరకొండ, సమంత ఖుషి ఫస్ట్ సింగిల్

Vijay Devarakonda, Samantha
Vijay Devarakonda, Samantha
డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్రయూనిట్.
 
ఖుషి సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రస్తుతం స్వింగులో ఉన్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే నా రోజా నువ్వే, ఆరాధ్య వంటి పాటలు వచ్చాయి. యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాట అయిన నా రోజా నువ్వే వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది.
 
వంద మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టిన నా రోజా నువ్వే పాట ఇప్పుడు మరోసారి నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. గత పదకొండు వారాలుగా ఈ పాట ఎక్కడో చోట ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఇక ఈ మూవీ నుంచి జూలై 28న మరో పాట విడుదల కానుంది. ఖుషి టైటిల్ సాంగ్‌ను రేపు విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.