శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (19:13 IST)

సమంత- విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ అదుర్స్.. వారి స్నేహబంధం..

Deverakonda and Samantha
టాలీవుడ్ స్టార్స్ సమంత రూత్ ప్రభు- విజయ్ దేవరకొండ కాంబో అంటేనే ప్రేక్షకుల మధ్య జోష్ వుంది. వీరిద్ద‌రి సినిమా ఖుషి ఇంకా విడుద‌ల‌ కాలేదు. అయితే ఈ జోడీపై భారీ అంచనాలున్నాయి. 
 
ప్రముఖ నటులు. ఇద్దరు పెద్ద తారలు ఒక్కటైతే అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, పాటలలో, విజయ్, సమంతల కెమిస్ట్రీ అదిరిపోయింది. వారి ఫేక్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చిత్రం విడుదల తర్వాత ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. 
 
సమంత, విజయ్ స్నేహితులు. బహుశా ఈ బంధమే తెరపై బాగా వర్కౌట్ అవుతోంది. తన సహనటుడు కమ్ స్నేహితుని కోసం సమంత రాసిన అద్భుతమైన ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.