వైరల్ అవుతున్న సమంత వెకేషన్ ఫోటోలు
అగ్రనటి సమంత వెకేషన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి ఏడాది పాటు సినిమాలకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఏడాది పాటు సమంత మయోసిటిస్, కండరాల బలహీనతతో బాధపడుతోంది.
ఇందుకోసం చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో నిర్మాతల నుంచి అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన సన్నిహిత మిత్రులతో కలిసి విదేశాలకు వెకేషన్ కోసం వెళ్లింది. తాజాగా సమంత పోస్టు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.