ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 22 నవంబరు 2023 (20:53 IST)

ఎదిగే పిల్లలకు బెల్లం- వేరుశనగ పప్పు ఉండలు ఇవ్వాలి, ఎందుకంటే?

ground-nuts
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుశెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. వేరుశనగపప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాము. పల్లీల్లో గుండెకు మేలు చేసే కొవ్వులు ఎక్కువ. ఇందులోని ప్రోటీన్‌ శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ.
 
ఎదిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులు వీటిని తింటే శరీరానికి అవసరమైన శక్తి వస్తుంది. వేయించిన గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. వీటిని తింటే హెపటైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ వంటివి రాకుండా ఉంటాయి. నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు పల్లీలు నానబెట్టి బెల్లంతో కలిపి తింటే ఐరన్‌తో పాటు పోషకాలూ అందుతాయి.
 
బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీ, క్యారెట్లు, బీట్‌రూట్‌లతో పోలిస్తే వేరుశనగ పప్పులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. పల్లీల్లోని రిజవెరాట్రాల్‌ అనే రసాయనం హృద్రోగాల నుంచీ, క్యాన్సర్ల బారి నుంచీ రక్షించడమే కాకుండా నిత్యయవ్వనంతో ఉండేలా చేస్తుంది. మేక పాలలో కాస్త నిమ్మరసం పిండి తాగి ఓ గుప్పెడు వేయించిన పల్లీలు తింటే దీర్ఘకాలిక డయేరియా తగ్గుతుందట.