బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 21 నవంబరు 2023 (14:38 IST)

కంప్యూటర్ ముందు జాబ్, ఐతే ప్రతిరోజూ 45 నిమిషాలు నడక తప్పదు

walking
ఈరోజుల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగాలు ఎక్కువ. దానితో అంతర్గత అవయవాలకు పనిలేక పాడైపోతున్నాయి. అందువల్ల రోజూ కనీసం 45 నిమిషాల పాటు నడక ఖచ్చితంగా చేయాలని వైద్యులు సూచన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
స్థిరంగా కంప్యూటర్ ముందు కూర్చుకుని పనిచేసేవారు రెగ్యులర్ బ్రిస్క్ వాకింగ్ చేయాలి. ఇలాంటి నడక వల్ల ఆరోగ్యకరమైన బరువుతో పాటు శరీర కొవ్వును తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తరిమికొట్టవచ్చు.
 
టైప్ 2 డయాబెటిస్‌తో సహా వివిధ అనారోగ్యాలు దరిచేరకుండా నివారించవచ్చు. కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ని మెరుగుపరిచేందుకు నడక చక్కని మార్గం. ఎముకలు, కండరాలు బలోపేతం కావాలంటే ప్రతిరోజూ నడవాల్సిందే. నడకతో శరీర రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.