ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (19:20 IST)

మహిళల్లో ఒబిసిటీ.. గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి..?

green tea
ఒబిసిటీ ఆందోళన ప్రస్తుతం చాలామందిలో పెరిగింది. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళల్లో ఊబకాయం సమస్య ఉంటుంది. అలాంటి వారికి గ్రీన్ టీ దివ్యౌషధం. బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగడంతో పాటు వాకింగ్, జాగింగ్, యోగా వంటివి కూడా చేయొచ్చు. 
 
గ్రీన్ టీ బరువు తగ్గడానికి, కొవ్వును బర్న్ చేయడానికి.. ముఖ్యంగా పొట్ట కొవ్వును తగ్గించడానికి సాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మెటబాలిజంను పెంచి బరువు తగ్గడంలో సహాయపడతాయి. 
 
గ్రీన్ టీలో కెఫిన్ చాలా తక్కువ. గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే ఒక రకమైన పాలీఫెనాల్ ఉంటుంది. ఈ క్యాటెచిన్లు యాంటీ ఆక్సిడెంట్లు.. బరువు తగ్గడంలో సహాయపడతాయి. 
 
గ్రీన్ టీలోని ఫ్లేవనాయిడ్లు, కెఫిన్ జీవక్రియ రేటును పెంచడానికి, కొవ్వు ఆక్సీకరణను పెంచడానికి, ఇన్సులిన్ చర్యను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
 
గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి..?
బరువు తగ్గడానికి గ్రీన్ టీ బ్రేక్ ఫాస్ట్‌కి 1 గంట తర్వాత గ్రీన్ టీ తాగాలి
అలాగే భోజనం చేసిన 2 గంటల తర్వాత గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. 
రోజుకు 3 లేదా 4 కప్పుల గ్రీన్ టీ త్రాగాలి.
పరగడుపున గ్రీన్ టీ తాగవచ్చు. 
ఆహారం తీసుకున్న 10 నుంచి 15 నిమిషాల తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.