ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (23:14 IST)

గ్రీన్ టీ సైడ్ ఎఫెక్ట్స్, ఏంటవి?

green tea
చాలామంది ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో ఎలాంటి క్యాలరీలుండవు. అయితే కొద్దిగా షుగర్ వేయడం వల్ల, ‘వెయిట్ లాస్ ఫ్రెండ్లీ' అనే ట్యాగ్ దానంతట అదే కోల్పోయినట్లే. స్వీట్ గ్రీన్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశం లేకపోలేదు.
 
బరువు తగ్గాలనుకొనేవారు గ్రీన్ టీలో షుగర్‌కు బదులుగా తేనె కలుపుకుని తాగినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే అధిక యాంటీయాక్సిడెంట్స్ హార్మోనులను విడగొట్టడం వల్ల గ్రంథుల్లో మార్పులు వస్తాయి. గ్రీన్ టీలో టానిన్ అనే కంటెంట్ ఉదరంలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రక్తంలో న్యూట్రిషియన్స్ షోషణ గ్రీన్ టీ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్.