గురువారం, 7 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (23:55 IST)

ఆవు పాలలో కుంకుమ పువ్వు, చక్కెరను కలుపుకుని తాగితే?

milk
ఆవు పాలు. ఈ పాలకు పలు అనారోగ్య సమస్యలను నయం చేయగల శక్తి వుంది. ఆవుపాలు తీసుకున్నవారికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని దేశవాళీ ఆవునెయ్యి నాలుగు చుక్కల మోతాదుగా రెండుపూటలా రెండు ముక్కుల్లో వేస్తుంటే పార్శ్వపు తలనొప్పి తగ్గిపోతుంది. శరీరం లోపల జ్వరం వున్నట్లుగా వుడికిపోతుండేవారు ఆవు వెన్న పటికబెల్లం పొడి కలుపుకుని తింటుంటే జ్వరం తగ్గుతుంది.
 
ఆవు వెన్న 10 గ్రాములు, పటికబెల్లం 10 గ్రాములు కలిపి రెండు పూటలా తింటుంటే క్షయ వ్యాధి వున్నవారికి సమస్య త్వరగా తగ్గుతుంది. తాజా ఆవు వెన్నను కళ్లచుట్టూ సున్నితంగా రాసి మర్దనచేస్తే నరాలలో రక్తప్రసరణ జరిగి వెంటనే మంటలు తగ్గుతాయి. ఆవు పాలలో కొవ్వును శాతం తక్కువ కనుక అధిక బరువు నియంత్రించుటలో ఈ పాలు చాలా సహాయపడుతాయి.
 
ఆవు పాలలో కాస్త కుంకుమ పువ్వును, చక్కెరను కలుపుకుని తీసుకుంటే పైల్స్ సమస్యల నుండి విముక్తి చెందవచ్చు.