మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 30 మార్చి 2023 (23:18 IST)

వదలని మొండి చుండ్రు, ఇంటి చిట్కాలతో పారదోలవచ్చు

చుండ్రు. ఈ సమస్యతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. చుండ్రును నివారించేందుకు ఏవో కృత్రిమ పద్ధతులు వాడుతుంటారు. ఐతే చిన్నచిన్న చిట్కాలతోనే చుండ్రును వదిలించుకోవచ్చని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరినూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకలకు రాస్తుంటే అవి సహజసిద్ధమైన మెరుపుతో తన పూర్వాకృతిని పొందుతాయి.
 
250 గ్రాముల మజ్జిగ, పది గ్రాముల బెల్లం కలిపి మిశ్రమంగా చేసుకుని తలకు పట్టించుకుని స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. నిమ్మకాయ రసంతో తలంతా మర్దన చేసుకుని తదుపరి తలస్నానం చేసినా చుండ్రు నివారణ అవుతుంది. మందార పువ్వులను ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని చల్లారాక ఒక సీసాలో నిలవచేసుకుని ప్రతిరోజూ రాసుకుంటే చుండ్రు నివారణ అవుతుంది.
 
పెరుగు, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకుని వెంట్రుకలకు పట్టించినా చుండ్రు నివారణ అవుతుంది. పెద్ద ఉసిరికాయలు తీసుకుని ఎండబెట్టి దాని పొడిని గింజలతో సహా దంచుకుని.వాటిని తలకు పట్టిస్తే చుండ్రు, పేలు నివారణ అవుతాయి.