1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 24 మార్చి 2023 (23:55 IST)

హార్ట్ స్ట్రోక్‌ను అవకాడో ఏం చేస్తుందో తెలుసా?

అవకాడో పండులో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండుటవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల గుండె పోటు నిరోధించడానికి మంచిది. అవకాడో పండు నూనెతో పొడి చర్మంపై మర్దిస్తుంటే మచ్చలు మటుమాయమవుతాయి.
 
అవకాడో పండు తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించబడుతాయని అంటారు. అవకాడో పండును ఆర్థరైటిస్ నొప్పి నివారణకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. అవకాడోలో యాంటి ఏజింగ్ లక్షణాలు ఉండటంవల్ల చర్మం తాజాగా, తక్కువ వయస్సున్న వారిలా కనబడేట్లు చేస్తుంది. అవకాడోలో కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వు కారణంగా బరువు పెరిగే వారికి చాలా మంచిది.