రాత్రి పూట నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తినరాదంటారు, ఎందుకు?
రాత్రి భోజనంలో నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తినరాదని వైద్య నిపుణులు చెపుతుంటారు. ఆమ్లతత్వం వున్న వీటిని తినడం వల్ల కలిగే దష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రివేళ చేసే భోజనంతో పాటు నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినకూడదని నిపుణులు చెపుతారు. రాత్రిపూట వాతం అధికముగా ఉంటుంది కనుక తినరాదని చెప్తారు.
నిమ్మ, ఉసిరి పచ్చళ్లు తిన్నవారి తలలోని సూక్ష్మనాడులు పగిలి పక్షవాత రోగం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తారు. 'పత్యం శతగుణం ప్రోక్తం' అంటే, సర్వ వైద్యములకు పత్యం చేయడం మిక్కిలి శ్రేయస్కరం. వాత రోగులు ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్త చింతకాయ, ఉసిరి పచ్చడి తినరాదు.
రాత్రిపూట భోజనంలో కొంతమందికి పెరుగు లేదా మజ్జిగ అన్నంలో పచ్చళ్లను తినడం అలవాటు.
నిమ్మ, ఉసిరి పచ్చడిని తినకుండా ఉండటం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు.