శనివారం, 5 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (23:03 IST)

ఆకులు తీసిన ముల్లంగి కాడ రసంలో తేనె కలిపి తాగితే? (video)

ముల్లంగి. ఇది కాస్త కారపు రుచితోనూ వేడిచేసే తీక్షణ స్వభావం కలిగి కడుపులోని ఆమ్ల దోషంతో పాటు త్రిదోషాలను హరిస్తుంది. ముల్లంగి తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ముల్లంగి గింజలను ఉత్తరేణి ఆకురసంతో కలిపి మెత్తగా నూరి బొల్లిమచ్చలపై లేపనం చేస్తుంటే అవి తగ్గుతాయి. ముల్లంగి ఆకు రసం నిద్రించే ముందు పావుకప్పు సేవిస్తే కడుపులోని క్రిములు నశిస్తాయి.
 
ముల్లంగి దుంపల ముక్కలపై కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు చల్లి వాటిని తింటే పళ్లు, చిగుర్లు గట్టిపడి చీము, నెత్తురు తగ్గుతుంది. ఆకులు తీసిన ముల్లంగి కాడను దంచి రసం తీసి కప్పు మోతాదుగా ఓ చెంచా తేనె కలిపి రెండుపూటలా తాగితే మూత్రకోశంలోని రాళ్లు కరుగుతాయి.
ముల్లంగి ఆకు రసాన్ని మూడుచుక్కలు ముక్కుల్లో వేస్తే పసికరలు తగ్గుతాయి. బట్టతల అవుతున్నవారు వెంట్రుకలు ఊడినచోట ముల్లంగి ముక్కతో రోజూ రాత్రి నిద్రించే ముందు రుద్ది ఉదయం కడిగేస్తుంటే వెంట్రుకలు మొలుస్తాయి.
 
ముల్లంగి గింజలను పొడిచేసి దానికి సమానంగా పటికబెల్లం పొడి కలిపి నిల్వ వుంచుకుని రెండు పూటలా పావు చెంచా మంచినీటితో సేవిస్తే కీళ్లనొప్పులు తగ్గుతాయి.