ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 29 నవంబరు 2022 (22:59 IST)

శీతాకాలంలో తినాల్సిన ప్రత్యేక ఆహారం ఏమిటి?

క్యారెట్- వీటిలో విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం వుంటాయి. శీతాకాలంలో రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి.
 
బంగాళాదుంపలు- వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇవి యాంటీఆక్సిడెంట్.
 
ఉల్లిపాయలు- ఇవి యాంటీఆక్సిడెంట్లు, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
 
వెల్లుల్లి- వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీర రక్షణకు ఎంతో దోహదం చేస్తాయి.
 
ముల్లంగి- ముల్లంగి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, కిడ్నీ వ్యాధులు, పైల్స్, కామెర్లు మొదలైనవాటిని నయం చేస్తుంది. ముల్లంగి ఆకుకూరలు మధుమేహానికి ఉత్తమ ఔషధం.
 
చిలగడదుంపలు- జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్- వ్యతిరేక పోరాట లక్షణాలను కలిగి వుంటాయి.
 
పాలకూర- రక్తహీనత లేదా అనీమియాతో బాధపడే వారికి పాలకూర మంచి ఔషధంలా పని చేస్తుంది.
 
మెంతికూర- మెంతి కూర తింటే శరీరానికవసరమైన పోషకాలు అందుతాయి. లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర చక్కగా పనిచేస్తుంది.
 
పుదీనా- ఇందులో మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాలుగా ఇది మేలు చేస్తుంది.