శీతాకాలం.. వేడి వేడి ముల్లంగి చపాతీ టేస్ట్ చేశారా? (video)
Radish chapathi
కావలసిన పదార్థాలు
గోధుమ పిండి- రెండు కప్పులు
ముల్లంగి తురుము- కప్పు
జీలకర్ర- అరచెంచా
కారం - చెంచా
అల్లం వెల్లుల్లి- చెంచా
ఉప్పు- నీళ్లు- నూనె- నెయ్యి-తగినంత
తయారీ విధానం: ముందుగా ఓ బౌల్‌లో గోధుమ పిండి, ముల్లంగి తురుము, ఉప్పు, కారం, వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పిండిని కలుపుకోవాలి. సహజంగా నీరు ముల్లంగిలో వుంటుంది కాబట్టి .. నీళ్లు కాసింత పోసి కలుపుకోవాలి. పావు గంట ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టాలి. ఆ తర్వాత చపాతీల్లా వేసుకుని పెనంపై నేతితో కాల్చుకోవాలి. అంతే ముల్లంగి చపాతీ రెడీ. వీటిని వేడి వేడిగా గ్రీన్ చట్నీ, టమోటా సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
