హెయిర్ ఫాల్ సమస్యకు ఏసీలు అతిగా వాడటం కారణమా?
నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టేందుకు చాలామంది డబ్బు ఖర్చు చేసి మందులు వాడుతున్నారు. అయినా జుట్టు రాలడం ఆగదు ఇలాంటప్పుడు మన ఆహారపు అలవాట్లు జుట్టు రాలడానికి కారణమని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఏసీలు అధికంగా వాడటం ద్వారా కూడా జుట్టు రాలే ఏర్పడుతుందని తద్వారా చుండ్రు, వెంట్రుకలు ఊడిపోవడం జరుగుతుందని చెప్తుంటారు.
వెంట్రుకలు రాలడం, చర్మవ్యాధులు వంటి శారీరక రుగ్మతలకు ఒత్తిడి కూడా కారణమని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎక్కువ సేపు ఏసీలో ఉండడం మానుకోవాలని, తద్వారా వెంట్రుకలే కాకుండా శరీర ఆరోగ్యం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు.
మన పూర్వీకులు సహజంగా జీవిస్తున్నప్పుడు ఎలాంటి శారీరక సమస్యలు లేకుండా జీవించారని, అయితే కృత్రిమంగా రకరకాల సౌకర్యాలు కల్పించిన తర్వాతనే జుట్టు రాలడంతోపాటు అనేక సమస్యలు వస్తున్నాయి.