మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 28 అక్టోబరు 2022 (15:36 IST)

లవంగాలు అధికంగా తింటే ఏం జరుగుతుంది?

జలుబు, దగ్గులో లవంగాన్ని ఉపయోగిస్తారు. ఇది దంతాలకు కూడా మేలు చేస్తుంది. ఐతే ఈ లవంగాలను ఎక్కువగా తీసుకుంటే నష్టం కలిగిస్తుంది. అవేంటో చూద్దాము. లవంగాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. చర్మం దెబ్బతింటుంది, మొటిమలకు దారితీస్తుంది.
 
లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు, ఛాతీ లేదా పొట్టలో మంట కూడా వస్తుంది. లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. దీని అధిక వినియోగం వల్ల అలర్జీకి దారితీసే అవకాశం కూడా లేకపోలేదు.
 
లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగులు దెబ్బతింటాయి. లవంగాలు తినడం గర్భిణీ స్త్రీలకు హాని కలిగించవచ్చు. లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయం, కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.