ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (10:59 IST)

జైలులో యోగా - వాకింగ్ చేసిన చంద్రబాబు... నేడు కుటుంబ సభ్యులతో ములాఖత్

chandrababu naidu
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టు అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలోని కేంద్ర కారాగారంలోని ప్రత్యేక సెల్‌లో ఉంటున్నారు. రెండో రోజైన మంగళవారం ఆయన తన కాలకృత్యాలను పూర్తి చేసుకుని యోగాతో పాటు వాకింగ్ చేసి ఆ తర్వాత మళ్ళీ తన గదిలోకి వెళ్లిపోయారు. సోమవారం రాత్రి త్వరగా నిద్రపోయిన చంద్రబాబు... మంగళవారం ఉదయం వార్తాపత్రికలను చదివారు. ఆ తర్వాత తన సహాయకుడు అందించిన అల్పాహారాన్ని స్వీకరించారు. ఆ తర్వాత ఆయన రెగ్యులర్‌గా తీసుకునే మందులను వేసుకుని, తన గదిలోకి వెళ్లిపోయారు. 
 
ఇదిలావుంటే, మంగళవారం ఆయన తన కుటుంబ సభ్యులతో ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. జైల్లో స్నేహా బ్లాక్‌ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. బ్లాక్‌లో ఒక ప్రత్యేక గదిని ఆయనకు ఇచ్చారు. చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై మంగళవారం మధ్యాహ్నం తీర్పును వెలువరించనుంది.