మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (19:25 IST)

అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు... 14 రోజుల రిమాండ్

chandrababu
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్‌ విధించింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. 
 
ఆదివారం ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి. ఈ కేసులో కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్‌ రిపోర్టుపై ఇరుపక్షాలు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. చంద్రబాబుకు రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.