చంద్రబాబు అరెస్టుతో గుండెపోటుతో 6 మంది మృతి
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి చోటు చేసుకున్నట్టుగా ఆరోపిస్తూ ఏపీ సీఐడీ పోలీసులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడాన్ని జీర్ణించుకోలోని టీడీపీ శ్రేణుల్లో ఆరుగురు గుండెపోటుతో చనిపోయారు. వీరంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావడం గమనార్హం. మొత్తం ఆరుగురు చనిపోయారు. వారి వివరాలను పరిశీలిస్తే,
అనంతపురం జిల్లాకు చెందిన వడ్డే ఆంజనేయులు (65) చంద్రబాబు అరెస్ట్ కావడాన్ని టీవీలో చూస్తూ గుండెపోటుతో మృతి.
కోనసీమ జిల్లాకు చెందిన కాకర సుగుణమ్మ (65) చంద్రబాబు అరెస్టును తన మనవడు సెల్ ఫోన్లో చూస్తూ గుండెపోటుతో మృతి.
కోనసీమ జిల్లాకు చెందిన చెల్లుబోయిన నరసింహ రావు (62) చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూస్తూ ఒత్తిడికి లోనై గుండెపోటుతో మృతి.
విజయనగరం జిల్లాకు చెందిన రైతు పైడితల్లి (67) చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనకు బయలుదేరి గుండెపోటుతో మృతి.
కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి సుధాకర్ రావు (60) టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి.
తిరుపతి జిల్లాకు చెందిన వెంకటరమణ (46) సైతం టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి.