శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (10:49 IST)

అలిపిరి నడకదారిలో ఎలుగుబంటి..

bears
తిరుపతి అలిపిరి నడకదారిలో వన్యమృగాల సంచారం పెరిగిపోతోంది. ఇప్పటికే చిరుత భయం శ్రీవారిని భక్తులను భయపెడుతోంది. ఇది చాలదన్నట్లు అలిపిరిలో బుధవారం రాత్రి 11.45 గంటల నుండి 12.30 గంటల మధ్య ఎలుగుబంటి తిరుగుతూ కనిపించింది. దీన్ని చూసి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. 
 
చాలాసేపటికి ఎలుగుబంటి ఆ ప్రాంతంలో నడకదారిలో తిరుగుతూ కవిపించింది. దీనిపై భక్తులు తిరుపతి దేవస్థాన భద్రతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అటవీ శాఖాధికారులకు సమచారం అందించారు. ప్రస్తుతం ఎలుగుబంటికి బోనును అమర్చారు. తిరుపతి అలిపిరి నడకదారిలో చిరుతలు, ఎలుగుబంటి తిరగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.