సంబంధిత వార్తలు
- అలిపిరి నడక మార్గంలో ఎలివేటెడ్ ఫుట్పాట్ : ఏపీ ప్రిన్సిపల్ సీసీఎఫ్వో వై.మధుసూదన్ రెడ్డి
- తిరుమలలో ఆ సమాధి... శ్రీ చక్రాలు.. చంద్రుడి ప్రభావం ఎక్కువ..
- తిరుమలలో చిక్కిన మరో చిరుత - 2 నెలల్లో 5 చిరుతల పట్టివేత
- 'గోవిందా' 'గోవిందా' అని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం..
- శ్రీవారి సేవలో పాల్గొన్న 'జవాన్' - వెంట నయనతార కూడా..
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఆళ్వార్ తిరుమంజన సేవ..
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆళ్వార్ తిరుమంజన సేవను నిర్వహించారు. దీని కోసం 6 గంటల పాటు భక్తులకు దర్శనం నిలిపివేయడం జరిగింది. తిరుమలలో ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆలయాన్ని శుద్ధిచేసే ఆళ్వార్ తిరుమంజన సేవ జరిగింది.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరానికి నాలుగు సార్లు ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆచారం. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పండుగలను పురస్కరించుకుని ఈ సేవను నిర్వహిస్తాం. ఈసారి బ్రహ్మోత్సవాల కోసం మంగళవారం ఆలయ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించామన్నారు.
మంగళవారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఆలయ శుభ్రత కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు, ఆలయం మొత్తం ఈ సేవ జరిగింది. ఆళ్వార్ తిరుమంజన సేవకు అనంతరం స్వామి వారికి అభిషేక, అలంకరలు జరిగాయి. ఆపై భక్తులకు శ్రీవారి దర్శనం కలుగ జేశారు.
తర్వాతి కథనం
