శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (22:26 IST)

పోలాల అమావాస్య.. పిల్లల యోగ క్షేమాల కోసం పూజ..

శ్రావణ మాసం, చివరి రోజున గురువారం నాడు పోలాల అమావాస్య వచ్చింది. శ్రావణ మాసంలో చివరి రోజున, భాద్రపదంలో మొదటగా వచ్చే రోజును పోలాల అమావాస్య అంటారు. ఆ పర్వదినాన గోమాత పేడతో ఇంటిని అలికి పసుపు, కుంకుమను కందమొక్కకు రాసి, కందమొక్కను అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరాన్ని కందమొక్కకు కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరాంటాలకు ఇచ్చి మనం కట్టించుకోవాలి. 
 
పిండి వంటలను అమ్మవారికి నివేదన చేయాలి. తర్వాత తాంబూలం, దానధర్మాలు వారి శక్తి మేరకు ఇచ్చుకోవాలని సంతానం నిలవని ఓ బ్రాహ్మణకు పోచమ్మ తల్లి వివరించినట్లు పురాణాలు వున్నాయి. అలాగే ఈ అమావాస్య రోజున పెళ్లయిన మహిళలు సంతానం కోసం, పిల్లల యోగ క్షేమాలను కోసం వ్రతాలు ఆచరిస్తారు. 
 
పూర్వీకుల అనుగ్రహాన్ని పొందడానికి, తర్పణం, శ్రద్ధ, పిండ దానం వంటి ఆచారాలను నిర్వహించాలి. ఈ ఆచారాల ద్వారా వారి ఆశీర్వాదాలు పొందవచ్చు. ఈ అమావాస్య రోజున పూర్వీకుల పేరు మీద అవసరమైన వారికి బట్టలు, డబ్బు లేదా ఆహారాన్ని దానం చేయాలి.