1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Effortless ways to fight Sweat Related Odor

శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?

Sweat
వేసవి కాలం ప్రారంభమైంది. పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసినప్పటికీ, మధ్యాహ్నానికి శరీరం నుంచి చెమట వాసన ఇబ్బందిపెడుతుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసనను పొగొట్టడానికి ఈ చిట్కాలను పాటిస్తే చాలా మంచి ప్రభావం కనిపిస్తుంది.
 
* ఒక టేబుల్ స్పూన్ తేనెను బకెట్ నీళ్లలో కలిపి, ఆ నీటితో స్నానం చేయండి. చెమట కానీ, చెమట వాసన కానీ మీ దరిచేరదు.
 
* వేసవిలో ఎక్కువ భాగం కాటన్ దుస్తులను ధరించడం వల్ల శరీరానికి బాగా గాలి అందుతుంది. ఫలితంగా దుర్వాసన రాదు.
 
* టీ, కాఫీలు చెమట ఉత్పత్తికి కారకాలు. కాబట్టి చెమట వాసన నుంచి తప్పించుకోవడానికి టీ, కాఫీలకు దూరంగా ఉండండి.
 
* రోజువారీ తీసుకునే ఆహారంలో 20 శాతం మాంసకృతులు, 20 శాతం నూనెలు, కొవ్వు పదార్థాలు, పండ్లు ఉంటే చెమటను దూరం చేయవచ్చు.
 
* స్నానపు నీటిలో ఉడికించిన పుదినా ఆకులను వేసి స్నానం చేస్తే చర్మం ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.
 
* సోంపు గింజలు నోటినే కాకుండా శరీర వాసనను ప్రభావితం చేస్తాయి. రోజూ ఒక స్పూన్ సోంపు గింజలను తినడం మంచిదే. 
About Writer
మోహన్
తర్వాతి కథనం
నడుమునొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..