1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits of Bermuda Grass or garika

గరిక గడ్డి ఆరోగ్య ప్రయోజనాలు

What are the benefits of Bermuda grass
గరిక గడ్డి. గడ్డే కదా అని తేలికగా తీసిపారేయకూడదు. ఈ గరిక గడ్డిలో అమూల్యమైన ఔషధ విలువలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
గరిక వేర్లను మెత్తగా నూరి అందులో కొద్దిగా పసుపు కలుపుకుని లేపనంగా వేసుకుంటే అలర్జీలు, దద్దుర్లు, దురదలు తగ్గిపోతాయి.
 
గరిక ఆకు రసాన్ని పూతగా వేస్తే గాయాల నుండి వచ్చే రక్తస్రావం ఆగుతుంది.
 
మెత్తగా నూరిన గరిక గడ్డి ముద్దను స్పూన్ మోతాదులో తీసుకుంటే అర్శమెులల నుండి వచ్చే రక్తస్రావం ఆగిపోతుంది.
 
గరిక ఆకులను ఎండబెట్టి పొడిచేసి స్పూన్ పొడిని అరకప్పు నీటిలో కలుపుకుని తాగితే కడుపులోని అల్సర్ తొలగిపోతుంది.
 
రెండు లీటర్ల గరిక ఆకుల రసాన్ని లీటరు కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనెను రోజు తలకు మర్దన చేస్తే చుండ్రు పారిపోతుంది.
 
గరిక ఆకులను నూరి పచ్చడిగా చేసుకుని భోజనంతో తీసుకుంటే శరీర నొప్పులు తగ్గుతాయి.
 
గరిక గడ్డి కషాయంతో నోటిని పుక్కిలిస్తే నోటి అల్సర్ తగ్గుతుంది. 
తర్వాతి కథనం
దంతాలను శుభ్రం చేసే ముళ్ల గోరింట