శుక్రవారం, 14 జూన్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 25 జనవరి 2023 (13:02 IST)

దంతాలను శుభ్రం చేసే ముళ్ల గోరింట

teeth
ముళ్ల గోరింట మొక్క పూలు చాలా అందంగా వుంటాయి. ఐతే ఈ మొక్కలో ఔషధ గుణాలు కూడా మెండుగా వున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాము.
 
ముళ్ల గోరింట మొక్క వేర్లతో పళ్లు తోముకుంటే దంతాలు మిలమిలా మెరుస్తాయి.
 
చర్మ సమస్యలైన గజ్జి, తామర, దురద వున్నవారు వీటి ఆకుల పేస్టును రాసుకుంటే తగ్గుతాయి.
 
దంతాలపై గార, పసుపుగా వుండటం పోవాలంటే ముళ్ల గోరింట ఆకుల పేస్టులో కొంచెం ఉప్పు కలిపి తోముకుంటే ప్రకాశవంతమవుతాయి.
 
నోటి దుర్వాసన పోయి ఫ్రెష్‌‌గా వుండాలంటే ఈ ఆకుల డికాషన్ చేసుకుని పుక్కిలిస్తే సరి.
 
ముళ్ల గోరింట బెరడు ఎండబెట్టి పొడిచేసి ఒక చెంచా తీసుకుంటే ఒళ్లు నొప్పులు, అధిక కొవ్వు తగ్గుతాయి.
 
మోకాళ్ల నొప్పులు బాగా ఎక్కువుంటే వాటి ఆకుల పేస్టును నొప్పి వున్నచోట రాస్తే నొప్పి, వాపులు తగ్గుతాయి.
 
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలి.