ఆదివారం, 26 మార్చి 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified శుక్రవారం, 20 జనవరి 2023 (13:17 IST)

సీడ్‌లెస్ నల్ల ద్రాక్ష తింటే ప్రయోజనాలు ఏమిటి?

grapes
గింజలు లేని నల్ల ద్రాక్ష. ద్రాక్షలలో రెండుమూడు రకాలు వున్నప్పటికీ ద్రాక్ష వల్ల ప్రయోజనాలు దాదాపు ఒకేలా వుంటాయి. ఈ నల్ల ద్రాక్షతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
రక్తనాళాలలో రక్తసరఫరాను మెరుగుపరచడం ద్వారా నల్ల ద్రాక్ష గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
 
కంటి ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నల్ల ద్రాక్షలో పుష్కలంగా వున్నాయి.
 
యాంటిఆక్సిడెంట్ గుణాలు వున్నందున క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నిరోధిస్తాయి.
 
ద్రాక్షలో రిబోఫ్లేవిన్ వున్నందున, మైగ్రేన్‌లతో బాధపడేవారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.
 
నల్ల ద్రాక్ష ఇన్సులిన్ నియంత్రణను మెరుగుపరుస్తాయి కనుక మధుమేహం నివారణలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
 
బ్లాక్ గ్రేప్ సీడ్ ఆయిల్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉన్నాయి, ఇవి నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరచి కేశాలకు మేలు చేస్తాయి.
 
నల్ల ద్రాక్షలో విటమిన్ సి, కె, ఎలతో పాటు ఫ్లేవనాయిడ్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.