1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits of bitter gourd

కాకరకాయ పొడిని పాలలో కలిపి..?

bitter hourd
కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాకరకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్,, మినరల్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. తరచు దీనిని తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
1. కాకరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే.. మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. దాంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి... మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది.
 
2. కాకరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకోవాలి. వీటిలో ఉప్పు, కారం వేసి బాగా వేయించుకుని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమం కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
3. కాకరకాయలోని న్యూట్రియన్ ఫాక్స్ట్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తాయి. తరచు కాకరకాయ తీసుకుంటే.. శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
 
4. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే.. గ్లాస్ కాకరకాయ జ్యూస్ తీసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. శరీర ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది.
 
5. స్త్రీలు ఎక్కువగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అందుకు ఏవేవో మందులు కూడా వాడుతారు. అయినను సమస్య తగ్గదు. అలాంటప్పుడు కాకరకాయ తీసుకోవాలంటున్నారు వైద్యులు.
 
6. కాకరకాయతో తయారీ చేసిన వంటకాలు తీసుకుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలైన తొలగిపోతాయని ఇటీవలే ఓ అధ్యయనంలో తెలియజేశారు. 
 
7. కాకరకాయ తొక్కలను బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని పాలలో కలిపి అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
తర్వాతి కథనం
క్యారెట్ రైస్ తయారీ విధానం..?