గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 31 డిశెంబరు 2018 (10:15 IST)

చేపలు తీసుకుంటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...?

చేపలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. మెదడుకు కీలకమైన కొవ్వు ఆమ్లాలను (ఈఎఫ్‌ఏ) మన శరీరం తయారు చేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారానే పొందాల్సి ఉంటుంది. వీటిల్లో కీలకమైనది ఒమేగా 3 కొవ్వు ఆమ్లం. ఇది చేపల్లో, అవిసెలు, సోయాబీన్స్‌, అక్రోట్ల వంటి ఎండు పండ్లలో ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవటం వల్ల మెదడు పనితీరే కాదు, గుండె, కీళ్ల ఆరోగ్యమూ మెరుగవుతుంది. 
 
అలాగే టమోటాల్లో లైకోపేన్‌ అనే రసాయనం పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు మేలు చేసే యాంటీఆక్సిడెంట్. అంటే మన శరీరమంతా విశృంఖలంగా తిరుగుతూ కణాలను దెబ్బతీస్తుండే ఫ్రీ ర్యాడికల్ కణాలను అడ్డుకునే రసాయనం అన్నమాట. దీనివల్ల నాడీకణాలు కూడా దెబ్బతినకుండా ఉంటాయి. టమోటాలను ఉడికించి తింటే శరీరం లైకోపేన్‌ను మరింతగా గ్రహిస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. చేపలు, టమోటాలతో పాటు బి విటమిన్లు ఆకుకూరలు,  చికెన్‌, గుడ్లు తీసుకోవాలి.