శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (12:30 IST)

వామును నిప్పుపై వేసి ఆ పొగను ఒంటికి తగిలేట్టు చేస్తే...?

సాధారణంగా ప్రతీ ఒక్కరికి శరీరంలో ఏదైనా సమస్య తప్పకుండా ఉంటుంది. ఆ సమస్యలను తొలగించుకోవడానికి మందులు, మాత్రలు వాడుతుంటారు. వాటి వాడకం ఎక్కువవుతుంది కానీ.. సమస్య మాత్రం కాస్త కూడా తగ్గలేదని బాధపడుతుంటారు. ఈ క్రమంలోనే చర్మ వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి అవేంటో చూద్దాం..
 
1. జిల్లేడు పాలలో స్పూన్ ఆముదం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తరచు చర్మానికి రాసుకుంటే.. కాలి ఆనెలు హరించుకుపోతాయి.
 
2. మినుములు చర్మానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిని రాత్రివేళ నానబెట్టి ఉదయాన్నే రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని అరగంట పాటు అలానే ఉండాలి. ఇలా రెండువారాల పాటు చేస్తే.. తెల్లబొల్లి మచ్చలు తగ్గిపోతాయి. అలానే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
 
3. తులసి ఆకుల ద్వారా వచ్చే రసాన్ని తీసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. ఇలా చేస్తే గజ్జి, తామర, దురద, దద్దుర్లు త్వరగా పోతాయి.
 
4. చాలామంది శరీర నొప్పులతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటప్పుడు.. వామును నిప్పుపై వేసి ఆ పొగను ఒంటికి తగిలేట్టు చేస్తే చర్మం దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. 
 
5. ఉసిరిక పొడిలో తగినంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కలిపి తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుంది. దీంతో పాటు చర్మంలో ఉండే వ్యర్థాలు కూడా తొలగిపోతాయి.